![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -239 లో......పెద్దసారు, గంగ, రుద్ర గుడినుండి తిరిగి బయల్దేరతారు. కార్ లో వస్తుంటారు. పాపం వాళ్ళకి ఇంట్లో ప్రశాంతత అనేది లేదు.. ఎప్పుడు ఏదో ఒక డిస్టబెన్స్.. ఇప్పుడు వీళ్ళని కాసేపు ఒంటరిగా వదిలెయ్యాలని చెప్పి రుద్రని కార్ ఆపమని జ్యూస్ తీసుకొని రమ్మంటాడు. రుద్ర వెళ్ళగానే కార్ స్టార్ట్ అవ్వకుండా పెద్దసారు ప్లాన్ చేస్తాడు. రుద్ర వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు. కానీ కార్ స్టార్ట్ అవ్వకపోవడంతో మీరు కార్ రిపేర్ చేయించుకొని రండి నేను వెళ్తానని పెద్దసారు అంటాడు.
మీతో పాటు గంగని తీసుకొని వెళ్ళండి అని రుద్ర అనగానే నేను మధ్యలో ఫ్రెండ్ ని కలవాలి.. క్యాబ్ ని బుక్ చేసుకున్నాను.. వెళ్తున్నానంటూ వాళ్ళిందరికి ప్రైవసీ ఇచ్చి పెద్దసారు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వీరు దగ్గరికి ఇషిక వచ్చి మావయ్య గారు రుద్ర బావకి గంగకి ప్రైవసీ ఇవ్వాలని జాలీగా తిరిగి రమ్మని అన్నాడట అని ఇషిక అనగానే నువ్వు ఎందుకు జెలస్ గా ఫీల్ అవుతున్నావ్.. నువ్వు సూర్యతో వెళ్ళమని వీరు అంటాడు. అలా నేను సూర్యని అడిగితే పెద్దనాన్నతో చెప్పాలి.. అన్నయ్యని కార్ అడగాలని అంటాడు. నాకు అలా నచ్చదని ఇషిక అంటుంది. ఆ తర్వాత ప్రమీల కార్ లో ఇంటికి వస్తుంది. చూసావా కిచెన్ లో ఉండాల్సిన ప్రమీల అక్క.. బిజినెస్ చూసుకుంటుంది.. బిజినెస్ చూసుకోవాల్సిన నేను కిచెన్ లో ఉన్నానని ఇషిక అంటుంది.
ఒకసారి కార్ వెనకాల బండి చూడమని వీరు చెప్తాడు. అది కార్తీక్ ది.. ప్రమీల కార్ ని ఫాలో అవుతు వచ్చాడు. ఇషిక అతన్ని చూసి గుర్తుపట్టి అతను కార్తీక్ సూపర్ మార్కెట్ మేనేజర్ కదా అని అంటుంది. అంటే ప్రమీల వెంటపడుతున్నాడా, ఈ విషయం వెంటనే ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ఇషిక అనగానే వద్దు టైమ్ వచ్చినప్పుడు చెప్దామని వీరు అంటాడు. ఆ తర్వాత గంగ, రుద్ర ఇంటికి వస్తాడు. పది కిలో మీటర్లు నడిపించాడు.. అమ్మా.. కాళ్ళునొప్పులు అని గంగ అంటుంది. నువ్వే కదా సరదాగా వాకింగ్ చేస్తూ వద్దామన్నావని రుద్ర అంటాడు. ఎందుకిలా చేసావ్ రుద్ర భార్యని ఇలానే ట్రీట్ చేసేద అని అని పెద్దసారు అడుగుతాడు. దారిలో అన్నీ తినేసుకుంటూ వచ్చిందని రుద్ర అంటాడు. ఇక గంగ బెడ్ రూమ్ లో కూర్చొని నొప్పులు అని ఇబ్బంది పడుతుంటే రుద్ర వస్తాడు. నువ్వే కదా నడుస్తానన్నావ్ ఇప్పుడు మళ్ళీ ఇలా అంటున్నావని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |